Skip to main content

జలహారం కోసం 1238 పోస్టులు

-ఇంజినీర్లకు శుభవార్త

-పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు వెల్లడి
-గ్రామీణ తాగునీటిశాఖలో 529 ఇంజినీరింగ్ పోస్టులు.. భర్తీకి ఉత్తర్వులు జారీ
-ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో 709 మంది నియామకం


హైదరాబాద్, డిసెంబర్ 27 (టీ మీడియా): రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జలహారం (వాటర్‌
గ్రిడ్) కోసం కొత్తగా 1,238 ఇంజినీరింగ్ ఉద్యోగాలను భర్తీచేస్తున్నామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే 
తారకరామారావు వెల్లడించారు. గ్రామీణశాఖను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు 
తీసుకోవాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఈ పోస్టులు భర్తీ చేస్తున్నామని కేటీఆర్ 
తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే గ్రామీణ తాగునీటిశాఖలో 529 ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం 
అనుమతించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. జలహారం పనులపై మంత్రి కేటీఆర్ 
శనివారం మీడియాతో మాట్లాడారు.

ktr



2018నాటికి రాష్ట్ర ప్రజలందరికీ రక్షిత మంచినీటిని అందించడమే లక్ష్యంగా పెట్టుకొన్న తమ ప్రభుత్వం.. జలహారం 

పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్నదని తెలిపారు. దీనికోసం జలహారం ఇంప్లిమెంట్ 
ఏజెన్సీ అయిన ఆర్‌డబ్ల్యూఎస్ శాఖను బలోపేతం చేసేందుకు 529 కొత్త ఉద్యోగాలను భర్తీచేయాలని నిర్ణయించి, 
వాటికి అనుమతులు పొందామని చెప్పారు. వీటితోపాటు 709 మంది సీనియర్ అసిస్టెంట్స్, వర్క్‌ఇన్‌స్పెక్టర్లను 
ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించడానికి చర్యలు తీసుకొన్నామని పేర్కొన్నారు. ఈ కొత్త ఉద్యోగాల భర్తీని త్వరలోనే 
చేపడతామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

list2


కొత్త ఉద్యోగాల భర్తీతోపాటు ఆర్‌డబ్ల్యూఎస్ ఉద్యోగులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి చర్యలు 

తీసుకొన్నామని తెలిపారు. జలహారం పనుల్లో భాగమవుతున్న ఉద్యోగులకు వాహనం, ల్యాప్‌టాప్, 
క్షేత్రస్థాయిలో కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకొంటున్నట్లు మంత్రి చెప్పారు. ఈ చర్యల వల్ల 
జలహారం పనులు నిర్దిష్టకాలంలో పూర్తవుతాయని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. ఆర్‌డబ్ల్యూఎస్‌లో 
పనిచేస్తున్న ఉద్యోగులు, భర్తీచేయాల్సిన వివరాలు అందించాలని మంత్రి కేటీఆర్ అధికారులకు 
సూచించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే...: సీఎం ఆదేశాల మేరకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో రెండుసార్లు 

సమావేశాలు నిర్వహించి.. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను 
గుర్తించారు. ఈ సమాచారం ఆధారంగా తక్షణ అవసరం కింద ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలో 709 మంది 
ఉద్యోగులను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించాలని సీఎం నిర్ణయించారు. ఔట్‌సోర్సింగ్ ద్వారా 
47 మంది సీనియర్ అసిస్టెంట్లు, 662 మంది వర్క్‌ఇన్‌స్పెక్టర్లను నియమించడంతోపాటు కొత్తగా 
529 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది.  


Comments

Popular posts from this blog

Good news to all Telangana job seekers.... there are many job notifications released in this month.... Click below for more details........ 1. GROUP-IV SERVICES 2. JUNIOR ASSISTANT IN TELANGANA STATE ROAD TRANSPORT CORPORATION 3. MANDAL PLANNING AND STATISTICAL OFFICER / ASSISTANT STATISTICALOFFICER IN DIRECTOR 4. VILLAGE REVENUE OFFICER IN REVENUE DEPARTMENT etc....